దేవరకొండ, సెప్టెంబర్ 26 : స్వరాష్ట్రంలోనే ఆర్టీసీ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నదని శాసన మండలి చెర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్‌డిపో వెనుక భాగంలో రూ.80 లక్షలతో నిర్మించిన మినీ బస్టాండ్‌ను ఆయన ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం 17వ వార్డులో రూ.10లక్షలతో చేపడుతున్న పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం సంస్థను అభివృద్ధి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు.
మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు నల్లగాసు జాన్‌యాదవ్, వంగాల ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పస్నూరి యుగేంధరెడ్డి, రాజీనేని వెంకటేశ్వర్రావు, కేసాని లింగారెడ్డి, టీవీఎన్‌రెడ్డి, సైదులు, కౌన్సిలర్లు మల్లేశ్వరి, చిత్రం శ్రీవాణీ ప్రదీప్, మహ్మద్ రైస్, జయప్రకాశ్‌నారాయణ, చెన్నయ్య, గాజుల మురళి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, డీఎం రాజీవ్‌ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.