నల్గొండ విద్యా విభాగం(రామగిరి), మార్చి 15 : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్చే నేడు ప్రారంభం కానున్న భీమ్ దీక్షలో పాల్గొనేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్వేరో కమిటీ విద్యార్థులు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావుఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుల ఆలోచనలను ఆచరణలో తీసుకువచ్చే విధానమే స్వేరో భీమ్ దీక్ష అన్నారు.
మార్చి15 – ఏప్రిల్ 14వరకు పవిత్ర మాసంగా భావిస్తూ దీక్షలు కొనసాగనున్నట్లు చెప్పారు. వేల సంవత్సరాలుగా మానవ జాతిని పట్టి పీడిస్తున్న దురలవాట్లు, సాంఘిక రుగ్మతలను రూపుమాపి.. చదువు అనే ఆయుధంతో సంపూర్ణమైన జ్ఞానవంతమైన జీవితంతో బ్రతకండి అంటూ సమాజ హితం కోరుతూ సేవలందిస్తున్న స్వేరో భీమ్ దీక్షలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.