రామగిరి, డిసెంబర్ 09 : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బోధన, బోధనేతర ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ సిబ్బందిని క్రమబద్దీకరించడం, సమాన పనికి సమాన వేతనం అమలు, CAS ప్రమోషన్లు, పెండింగ్‌లో ఉన్న EPF చెల్లింపులు వంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరింది. అలాగే ఉద్యోగ భద్రత, ఔట్ సోర్సింగ్ కార్మికులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగుల హక్కుల రక్షణను నిర్దారించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. బహిరంగ లేఖ విడుదల కార్యక్రమంలో డాక్టర్, చింత శ్యామ్ సుందర్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ శ్రీనివాస్, శ్రీమతి ఉమా కత్తుల, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అనిత, డాక్టర్, సిరీస్, డాక్టర్, అరవింద్, డాక్టర్ శేఖర్, రమేష్ నాయక్, ససేహా తవ్విర్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ కాసాన్, డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.