రామగిరి, సెప్టెంబర్ 26 : నల్లగొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు 18 కేసుల్లో నిందితుడైన నలపరాజు రాజేశ్ @ మెంటల్ రాజేశ్ దోషిగా తేలడంతో నల్లగొండ ఫ్యామిలీ కోర్టు జీవిత ఖైదు, జరిమాన విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన నలపురాజు రాజేశ్‌తో పాటు పెరిక సాయితేజ @ టిల్లుపై నల్లగొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా విచారణ అనంతరం దోషులుగా తేలిన రాజేశ్, సాయితేజకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమాన విధిస్తూ నల్లగొండ AD J-III కమ్ ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది.
దోషులకు శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు, సీఐలు జె.రవీందర్, టి.మనోహర్ రెడ్డి, ఈ.రవీందర్, ఎస్ఐ క్రాంతి కుమార్, ప్రస్తుత డీఎస్పీ కె.శివరామ్ రెడ్డి, సీఐ ఎస్.రాఘవరావు, ఎస్ఐ వై.సైదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.జవహర్లాల్, సీడీఓ బి.సుమన్, కోర్టు లైజనింగ్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.