ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చందంపేట మండలం ఉస్మాన్ కుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో..
చందంపేట, జులై 01 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చందంపేట మండలం ఉస్మాన్ కుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన అంజనేయ స్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాలనలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం కేసీఆర్ విశేష కృషి చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ సర్కారు నిర్విరామంగా కృషి చేసినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల్లో ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకున్నదన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున:నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులను శరవేగంగా కేసీఆర్ సర్కార్ చేపట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ విశేష కృషి చేసిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, కేతవత్ శంకర్ నాయక్, సర్పంచ్ సత్యనారి, రామావత్ మోహన్ కృష్ణ, కేతావత్ రమేష్, లోటావత్ బీమా నాయక్, దాసు భావోజీ, ఉప సర్పంచ్ అను అతిరాం, ఫకీరా నాయక్, కేతావత్ హేము నాయక్, మంగ్య నాయక్, చందర్, లక్క, జబ్బర్, బిచ్చు, మంగతా, భాషా, జైల్ సింగ్, అరుణ్, అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

