హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి కొత్త నాయకత్వం ఖరారైంది. నవీన్ పెట్టంను చైర్మన్‌గా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకొన్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవీన్‌తోపాటు ఇద్దరిని కన్వీనర్లుగా, ఆరుగురిని కోఆర్డినేటర్లుగా, ముగ్గురిని కో-కోఆర్డినేటర్లు గా నియమించా రు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులో నవీన్ పెట్టంను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అంతేకాకుండా చంద్రబాబుకు సన్నిహితుడనే ప్రచారం జరుగుతున్నది. ఆయన టీడీపీ ఐడీ కార్డును చూపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.