హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రధానార్చకులు, వేదపండితులు, దేవస్థాన సిద్ధాంతి శాస్ర్తోక్తంగా చర్చించి ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్‌లో ఈ యాగం నిర్వహించనున్నారు. దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట క్షేత్ర పండితులు, అర్చకులు యాగాన్ని జరిపిస్తారు. 11 హోమగుండాలు ఏర్పాటుచేస్తున్నారు. 108 మంది రుత్వికులు, వేదపండితులు ఈ యాగంలో పాల్గొంటారు. మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ క్రతువు, మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగియనున్నది.