ACB Raids | భూగర్భ గనుల శాఖ డీడీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.3 కోట్ల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తింపు
ACB Raids | అక్రమ ఆస్తుల ఆరోపణలపై ఏసీబీ అధికారులు వరంగల్ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయ రాజ్ ఇంటిపై గురువారం దాడులు నిర్వహించారు.
హైదరాబాద్ : అక్రమ ఆస్తుల ఆరోపణలపై వరంగల్ భూగర్భ, గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయ రాజ్ ( Bojja Jaya Raj ) ఇంటిపై గురువారం ఏసీబీ అధికారులు ( ACB Raids ) దాడులు నిర్వహించారు. సుమారు రూ.3 కోట్ల ఆరు లక్షల అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్‌గా , ఎఫ్ఏసీగా వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు.
బొజ్జ జయరాజ్‌పై అనేక అవినీతి,ఆరోపణలు రావడంతో అతనికి సంబంధించిన 8 మంది బంధువుల ఇంట్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు ప్రకటనలో వెల్లడించారు. బోడుప్పల్లో జీ ప్లస్ -2 భవనం, కేపీహెచ్బీలో ఒక ప్లాట్, కీసన, తుంగతుర్తి, తుప్రాన్, సూర్యపేటలో ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, , రూ.10 లక్షల నగదు , బంగారం, బ్యాంక్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కలిపి రూ.3.06 కోట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు.
వీటి మార్కెట్ విలువ మరింత అధనంగా ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా డీడీ జయరాజ్‌కు చెందిన డ్రైవర్ సత్తునూరి యాదయ్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అతడి ఖాతా నుంచి కూతురు ఖాతాకు 24.8 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాలో సంపాదించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

