చండూరు, మే 30 : ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పొందవచ్చు అని యోగా నిర్వాహకుడు ఇడికూడ వెంకటేశ్ అన్నారు. అంతర్జాతీయ యోగా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్‌తో యోగాసనాలు వేయించారు. చండూరు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగా నేర్పించనున్నట్లు తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చదువుల్లో అద్భుతంగా రాణిస్తారన్నారు.