నార్కట్‌పల్లి ,అక్టోబర్ 15: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్ల్లి వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని అమ్మనబోలు గ్రామంలో ఆదివారం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధ్దితో పని చేయాలని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాయన అట్టి పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో ఎంతో అద్భుతంగా ఉందని అట్టి మేనిఫెస్టోను కూడా వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, సర్పంచ్ బద్దం వరమ్మ రాంరెడ్డి, ఎం పీటీసీ మేకల రాజిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.
చిట్యాల : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య గెలుపు కోసం బూత్ కమిటీ బాధ్యులు కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. మండలంలోని వనిపాకల, ఏపూరు గ్రామ బూత్ కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా నాయకులు బూత్ కమిటీ బాధ్యులు తమ తమ బూత్ ల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను కలుపుకొని పొతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధ్దిని వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడేలా పనిచేయాలని సూచించారు. సమావేశాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, ఎస్. యాదగిరి,వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ రుద్రారపు భిక్షపతి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కర్నాటి ఉప్పల్ రెడ్డి, మేడి నర్సింహ్మ, పాలెం మల్లేశం, ఏళ్ల సత్యనారాయణరెడ్డి, కొలను సతీశ్, తుమ్మల నాగరాజురెడ్డి పాల్గొన్నారు.
శాలిగౌరారం : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పల్లెబాటలో భాగంగా మండలంలోని జాలోనిగూడెం, శాలిలింగోటం, అంబారిపేట, తుడిమిడి, చిత్తలూర్, వంగమర్తి, ఇటుకులపహాడ్, మాదారం, పెర్కకొండారం ఆదివారం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా సమావేశాల్లో జడ్పీటీసీ ఎర్ర రణీల, వైస్ ఎంపీపీ కందుల అనిత, చాడ హతీశ్రెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, గుండా శ్రీనివాస్, తాళ్లూరి మురళి, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్, నూక సత్తయ్యయాదవ్, గంట శంకర్, బీరం శోభానర్సిరెడ్డి, పాక యాదయ్య, దుబ్బ వెంకన్న, చెలకాని మల్లేశ్, జహంగీర్, దాసరి వెంకన్న, అక్కెనపెల్లి శ్రీరాములు, చివుట సైదులు, సోమ రమేశ్, ఎలీశా, బొల్లం సైదులు, వెంకన్న పాల్గొన్నారు.
రామన్నపేట :నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అంతటి రమేశ్ అన్నారు. మండలంలోని బోగారం గ్రామంలో ఆదివారం గ్రామశాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో గ్రామంలో కోటి రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త బీఆర్ఎస్ మేనిఫెస్టోను, గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంతటి పద్మ, ఎంపీటీసీ గోగు పద్మసత్తయ్య, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం వెంకటరమణ, ఉపసర్పంచ్ జిల్లా శ్రీనివాస్, అంతటి మల్లేశం, చల్ల మల్ల నర్సింహరెడ్డి, మద్దెపూరి పద్మ య్య, వార్డు సభ్యులు గోగు వెంకట్మ్రణ, గుంజె గణేష్, మేడి వినోద, యాదయ్య, గుర్రం నీరజ, బోగ నర్సింహ, గోగు కలమ్మ, కడారి మల్లేశం, లింగం పాల్గొన్నారు.