కట్టంగూర్, నవంబర్ 27 : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్ ఎంజేఎఫ్ జిఈటి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి, శ్రీ నేత్ర ఆస్పత్రి హైదరాబాద్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైద్యులు సుమారు 250 మందికి మందికి ఆర్ బి ఎస్, బిపి, ఈసీజీ, టుడి ఈకో, బరువు తోపాటు పలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, లయన్స్ క్లబ్ సభ్యులు కడారి మల్లికార్జున్, రాపోలు వెంకటేశ్వర్లు గోషక ఉమాపతి, కార్డియాలజిస్ట్ మనజీర్, కంటి వైద్య నిపుణుడు చంద్రశేఖర్, జనరల్ వైద్యులు షైనీ, గైనకాలజిస్ట్ మౌనిక రెడ్డి, ఆర్థోపెడిక్ వైద్యుడు సూర్య, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అశోక్ రెడ్డి, కార్డియాలజీ టెక్నీషియన్ ఉమాదేవి, రమేశ్ భాస్కర్ పాల్గొన్నారు.