కోదాడ, మే 01 : ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎల్ఐసీ, బ్యాంక్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతృత్వంలో జెండాలు ఆవిష్కరించి కార్మిక దినోత్సవ ప్రాధాన్యత వివరించారు. కోదాడ ప్రభుత్వ దవాఖానాలో జిల్లా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి యాతాకుల మధుబాబు, ఎర్నేని వెంకటరత్నం బాబు, చింతకుంట లక్ష్మీనారాయణరెడ్డి, రాయపూడి వెంకటనారాయణ జెండాను ఆవిష్కరించారు.
ఐఎన్టీయూసీ ప్రాంతీయ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, చింతలపాటి శ్రీనివాసరావు, పాలూరు శ్రీనివాసరావు, ఒంటిపులి వెంకటేశ్, శ్రీధర్, సైదానాయక్ పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ జిల్లా నాయకులు ములకపల్లి రాములు, ముత్యాలు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు ఎస్కే నయీమ్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పైడిమరి సత్యబాబు, కర్ల సుందరరావు, మేదర లలిత, భాగ్యమ్మ, మామిడి రామారావు, ఉపేందర్, అలవాల వెంకట్ పాల్గొన్నారు.
Kodada : కోదాడలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
Kodada : కోదాడలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు