కోదాడ, మే 01 : కార్మిక దినోత్సవంను పురస్కరించుకుని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. కోదాడ పట్టణంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీఆర్టీయూ జెండాను పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ ఆవిష్కరించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యూసఫ్, మేకల శ్రీనివాసరావు పర్యవేక్షణలో వందలాది మంది కార్మికులు ఎర్ర చొక్కాలు ధరించి ఎర్ర జెండాలతో ప్రధాన రహదారిపై నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పాలక వర్గాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు.

కోదాడలో ఘనంగా ‘మే’ డే ఉత్సవాలు
కార్మిక సంక్షేమ చట్టాలను అమలు పరచడం లేదని, లేబర్ కోడ్ను రద్దుచేసి కార్మికుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మే డే ప్రాధాన్యతను వివరించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్, సీపీఐ నాయకులు పైడిమరి సత్యం బాబు, కె.బాబు, కౌన్సిలర్ చీమ నరేష్ భాగ్యమ్మ, మల్లయ్య గౌడ్, బి.ఉపేందర్, బెజవాడ వెంకటేశ్వర్లు, లతీఫ్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, జానీ, కార్మికులు పాల్గొన్నారు.

కోదాడలో ఘనంగా ‘మే’ డే ఉత్సవాలు