చండూరు, అక్టోబర్ 07 : వేధింపులు తాళలేక మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం కుటుంబ సభ్యులు, పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేట గ్రామానికి చెందిన పెద్దబోయిన రేణుక ఆశా వర్కర్‌గా పనిచేస్తుంది. ఆమె భర్త శ్రీను, అతడి తరపు బంధువులు, ఇడికూడ నాగరాజు అనే వ్యక్తి, అతడి బంధువుల వేధింపులు భరించలేక మానసిక ఒత్తిడికి గురై ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రేణుక తల్లి పిల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చండూరు ఎస్ఐ వెంకన్న తెలిపారు.