రామగిరి (నల్లగొండ), మే 14 : యువతిపై దాడి చేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధించింది. కేసు వివరాలు.. నల్లగొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతితో మేళ్లదుప్పలపల్లి గ్రామానికి చెందిన సాయిరాం అనే వ్యక్తికి ఓ ఫంక్షన్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అలుసు తీసుకున్న అతడు ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. యువతి తిరస్కరించినా వేధింపులు కొనసాగించాడు.
8 ఆగస్టు 2024న నల్లగొండ కంచనపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద వ్యక్తిగత పని కోసం వెళ్లిన యువతిపై సదరు వ్యక్తి దాడి చేశాడు. దీంతో బాధితురాలు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సైదాబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో యువకుడు దోషిగా తేలడంతో నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు మూడో అదనపు న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ బుధవారం శిక్ష ఖరారు చేస్తూ తీ్ర్పు వెలువరించారు. కేసు విచారణలో సహకరించిన అదన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జవహర్లాల్, ఎస్ఐ సైదాబాబు, టూ టౌన్ సీఐ రఘు రావు, సీడీఓకే దుర్గారాజు, కోర్టు లైజన్ అధికారులు పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.