కట్టంగూర్, జనవరి 23 : ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్‌లో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యర్కల సంతోష్ కుమార్ (35) గత కొంతకాలంగా కల్మెర రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో కుటుంబ సభ్యులతో కలిసి హాటల్‌ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శోభారాణి తీవ్ర అనారోగ్యంతో ఉండడంతో పాటు హోటల్ నడవక పోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున హోటల్ సమీపంలోని వ్యవసాయ పొలం గట్టు వద్ద ఉన్న టేకు చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిచారు. సంతోష్‌కుమార్ తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. సంతోష్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.