దేవరకొండ రూరల్, ఆగస్టు 19 : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మంగళవారం మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం భీమనపల్లిలో రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మారుపాక అరుణ సురేశ్, మాజీ సర్పంచ్ ముణికుంట్ల విద్యావతి వెంకట్రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.