తిరుమలగిరి మే 12: రైతులు తాము పండించిన ఉత్పత్తులను దేశంలోని ఏ మార్కెట్లోనైనా విక్రయించుకునేలా కేంద్రం ప్రవేశపెట్టిన ఈనామ్ విధానం నామ మాత్రంగానే ఉంది. ఈ విధానం జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. దీంతో రైతులకు మద్దతు ధర అందటం లేదు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మా ర్కెటింగ్) విధానం అమలు చేసింది. దేశంలోని 617 మార్కెట్లను దీని పరిధిలోకి తెచ్చి ఒక్కో యార్డులో రూ. 5లక్షల వ్యయంతో కం ప్యూటర్లు,ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
9 సంవత్సరాలు దాటినా ఈ-నామ్ యార్డులను జాతీయ సర్వర్‌తో అనుసంధానం చేయలేదు. ఇప్పటికీ రైతుల పంటల ఉత్పత్తులను ఆన్లైన్లో వేరే రాష్ర్టాలకు చెందిన వ్యాపారులెవరూ కొనుగోలు చేయటం లేదు. మొత్తంగా స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తుండటంతో ధరలో పెరుగుదల కనిపించటం లేదు.
జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట మార్కెట్ యార్డులను ఈ-నామ్ పరిధిలోకి చేర్చారు. వీటిని ఈ-నామ్ పరిధిలో చేర్చినా స్థానిక వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకు చెందిన వ్యాపారులెవరూ ఇక్కడి పంట ఉత్పత్తులను కొనటం లేదు. ఈ విధానంలో ఒక్క వేరు శనగను మాత్రమే వేరే ప్రాం తాల వారు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలోని రెండు మార్కెట్లలో ఈ-నామ్ విధానా న్ని పూర్తిస్థాయిలో అమలు చేసి స్థానిక రైతుల కు లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.
గతంలో మార్కెట్లలోని బీట్‌లో వేలం ద్వారా వ్యాపారులు ధరలు నిర్ణయించి రైతులు తెచ్చి న పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు. అయితే ఈ-నామ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కంపూటర్ల ద్వారా ధరలు కోడ్ చేస్తున్నారు. ఈ ఒక్కమార్పు తప్పితే ఈ-నామ్ విధానం వచ్చాక పంట ఉత్పత్తుల ధరల్లో ఏమాత్రం పెరుగుదల లేకపోవటంతో రైతులకు ఎలాంటి మేలు జరగటం లేదు.
ఈ-నామ్ మార్కెట్ల పరిధిలో గుర్తింపు పొం దిన వ్యాపారులు దేశంలో ఎక్కడి నుంచైనా సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఈ పద్ధతి ప్రకారం మార్కెట్ కార్యదర్శి ద్వారా ఆన్లైన్ లో చెల్లింపులు నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో వ్యాపారులు పోటీ పడే అవకాశం ఉంటుంది. జాతీయ ఏకీకృత మార్కెట్‌కు విస్తరిస్తే దూర ప్రాంతాల వ్యాపారులు ఆన్లైన్ ద్వారా మన మార్కెట్లలోని ఉత్పత్తులను కొనవచ్చు. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఈ మేర కు అన్ని యార్డులను ఈ-నామ్ సర్వర్‌కు అనుసంధానం చేయాలి.
చాలాకాలంగా ఖరీదుదారులు, కమీషన్దా రులు ఇక్కడే పాతుకుపోయి ఇక్కడి అవకాశాలను, రైతుల బలహీనతలను, అనుకూల పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రతి సీజన్లో దోపిడీ చేస్తున్నారు. ఆదాయ మార్గం కావటం తో అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పేరుకు మాత్రమే ఈ-నామ్ కావటంతో ఇక్కడి వ్యాపారులే కొనుగోళ్లు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను దగా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ఈ సీజన్లో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశా రు. చుట్టు పక్కల మండలాల నుంచి రైతులు మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి మక్కలను తెచ్చారు. ఇరవై రోజులు గడిచినా కాం టాలు వేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం రోడ్డుపై మక్కలు తగులబెట్టి రాస్తారోకో చేసారు. అధికారుల హామీతో మక్క రైతులు ధర్నా విరమించారు.
వ్యవసాయ మార్కెట్‌కు పెద్దమొత్తంలో వరి, ఇతర పంటలతోపాటు మక్కలు కూడా రావటంతో కొనుగోళ్లు, కాంటాలు, లారీల్లో తరలించం వ్యాపారులకు ఇబ్బంది అవుతుండటంతో వచ్చిన మక్క కొనుగోళ్లు తర్వాత కొత్త కొనుగోళ్లు చేపడతామంటూ మంగళవారం మార్కెట్‌ను బంద్ చేశారు. పాత వాటికి కాం టాలు వేసి తరలించారు. మక్క కొనుగోలు కేంద్రం వ్యవసాయ మార్కెట్లో కాకుండా మరోచోట ఏర్పాటు చేయాలని వ్యాపారులు, కమీషన్‌దారులు కోరుతున్నారు. ఈ విషయమై ఇవ్చార్జి కార్యదర్శి సురేశ్‌ను వివరణ కోరగా మార్కెట్లో వరి, ఇతర పంటలతోపాటు మక్క కొనుగోలు కేంద్రం ఉండటంతో ఇబ్బందులు వస్తున్న విషయం వాస్తవమేనని, అధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు.