భూదాన్ పోచంపల్లి, మే 29: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేతాజీ ప్రధాన కూడలిలో ధర్నానిర్వహించారు. రోడ్డుపై ధాన్యం పోసి రైతులు బైఠాయించారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేయడం లేదన్నారు. ధాన్యం దిగుమతి చేసుకునేందుకు స్థలం లేదన్నారు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటే గోడౌన్లు ఖాళీ అవుతాయన్నారు. పనిచేయని రైస్‌మిల్లుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
సమస్యను పరిష్కరిస్తామని డీటీ నాగేశ్వరావు, ఎస్సై కంచర్ల భాసర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతావెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు ముత్యాల మైపాల్ రెడ్డి, పగిల సుధాకర్‌రెడ్డి, నోముల మాధవరెడ్డి , ఐతరాజు భిక్షపతి, సీపీఎం మండల కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, నాయకులు సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్, పర్నె మల్లారెడ్డి, పగిల్ల రామ్ రెడ్డి, బండి కృష్ణ, మన్నె పద్మారెడ్డి, ఫకీరు సుధాకర్‌రెడ్డి, యాకరి నర్సింగ్‌రావు, చిలువేరు బాల నరసింహ, గునిగంటి మల్లేశ్‌గౌడ్, గుండు మధు, కర్ణాటి మధు, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, పర్సమోని సత్తయ్య, నాంపల్లి రవీందర్‌రెడ్డి, ఆర్ల వెంకటేశ్, ఆర్ల లింగస్వామి, కర్ణాటి అంజమ్మ, గుండు రాజమణి తదితరులు పాల్గొన్నారు.