మునుగోడు, డిసెంబర్ 30 : మునుగోడు మండల కేంద్రానికి చెందిన నడింపల్లి శ్రీనివాసులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి తన పరిస్థితిని వివరించడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే శ్రీనివాస్ ఆపరేషన్‌కి కావాల్సిన రూ.2.50 లక్షల ఎల్ఓసీని సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేయించారు. మంగళవారం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఎల్ఓసీని అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి జిట్టగోని యాదయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, మాజీ సర్పంచులు మిర్యాల వెంకన్న, పందుల నరసింహ, మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎండి.అన్వర్, పందుల మల్లేష్, వార్డ్ మెంబర్లు పందుల గంగాధర్, పందుల ప్రియాంక లింగస్వామి, బీసం గంగరాజు, అబ్బరబోయిన బాలకృష్ణ, పందుల రంజిత్, నాయకులు పందుల అశోక్, చిలువేరు సుదర్శన్, రేవెల్లి సైదులు, గ్రేగోరి, దుబ్బ ప్రభాకర్, దుబ్బ రవి, కట్ట రాజు పాల్గొన్నారు.