– తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్
తుంగతుర్తి, జూన్ 17 : ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎస్ఐ రుద్ర క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకునే కంటే.. పరస్పర అంగీకారంతో సమస్యలను ముగించుకునే రాజీ మార్గమే కక్షిదారులకు నిజమైన రాజమార్గం అన్నారు. ప్రజలకు త్వరితగతిన, అత్యంత సులభంగా, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ నెల 20న నిర్వహించనున్న ఈ ఏడాది రెండవ జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు, కక్షిదారులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.