కట్టంగూర్, ఆగస్టు 06 : లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కట్టంగూర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు, జిల్లా గ్యాట్ లీడర్ ఎర్ర శంభులింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఈదులూరు గ్రామానికి చెందిన చిక్కు శేఖర్, కార్యదర్శిగా కట్టంగూర్కు చెందిన గుడిపాటి శివప్రసాద్, కోశాధికారిగా పోగుల రాములు, ఉపాధ్యక్షులుగా రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శిగా బసవోజు వినోద్‌కుమార్, జీఎస్ టీగా ఆకవరపు బ్రహ్మచారి, జీఎంటీగా కక్కిరేణి నవీన్, జీఈటీగా తనిడబోయిన నర్సింహ్మ, ఎల్ సీఐఎఫ్ బొల్లోజు వెంకటాచారి, ప్రచారకర్తగా చెరుకు శ్రీనివాస్, గౌరవ సలహాదారుడిగా వున్న సుందరయ్యను ఎన్నుకున్నారు. సమావేశంలో లయన్స్ క్లబ్ జిల్లా డీసీ సభ్యులు డెంకెల సత్యనారాయణ, అంజిరెడ్డి, నకిరేకంటి శంకర్, జిల్లా ఉపేందర్ పాల్గొన్నారు.