‘గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలు’
గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ శాఖ గ్రంథాలయంలో..
– కట్టంగూర్ ఎంపీడీఓ జ్ఞాన ప్రకాష్ రావు, సర్పంచ్ శ్యామల
కట్టంగూర్, మార్చి 25 : గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ శాఖ గ్రంథాలయంలో పుస్తక పఠనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మార్చి, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, రోజువారీగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి చదువు ఎంతో అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, కానుగు శీను, పులకరం శీను, కానుగు సైదమ్మ, గ్రంథ పాలకురాలు తారకేశ్వరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

