– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, డిసెంబర్ 09 : 14 సంవత్సరాలు సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం విజయ్ దివస్‌ను పురస్కరించుకుని కోదాడ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో నంబర్ వన్‌గా నిలిపితే రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ అరాచక ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ను గద్దె దించి తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూసేందుకు ప్రతిన బూనుదామన్నారు.
కుంభకోణాలతో రాష్ట్రం ఇప్పటికే దివాలా తీసిందని, సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు. మంత్రులంతా కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటం చేసేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకులు పైడిమర్రి సత్యంబాబు, కర్ల సుందర్ బాబు, మేదర లలిత, భాగ్యమ్మ, గొర్రె రాజేశ్, అలవాల వెంకట్, ఉపేందర్, అబ్బు, సంగిశెట్టి గోపాల్, రామినేని సత్యనారాయణ, చీమ శ్రీనివాసరావు, కాసాని మల్లయ్య గౌడ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.