తుంగతుర్తి, జనవరి 30 : అవగాహనతో కుష్టు వ్యాధిని నివారించవచ్చని తుంగతుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండలం వెంపటిలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి నిర్మూలనపై సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది భారతమ్మ, కోయిల, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.