నందికొండ, నవంబర్ 20 : ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 18న ప్రచురితమైన ‘సాగర్‌లో సందడేదీ’ వార్త కథనంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 22వ తేదీ శనివారం నుంచి నాగార్జునసాగర్ టు శ్రీశైలంకు లాంచీ ట్రిప్పులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ నుంచి బయలు దేరే లాంచి సాయంత్రం 3 గంటలకు ( 6 గంటలు) శ్రీశైలం చేరుకుంటుంది.
టికెట్ రేట్లు..
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వెళ్లి రావడానికి పెద్దలకు రూ. 3500లు, పిల్లలకు రూ.2600లు, సాగర్ నుంచి శ్రీశైలం పోయేందుకు లేదా శ్రీశైలం నుంచి సాగర్ వచ్చేందుకు (ఒక వైపుకు) పెద్దలకు రూ. 2000, పిల్లలకు రూ. 1600లు చార్జ్ చేయనున్నారు. ప్రతి శనివారం శ్రీశైలంకు లాంచీ నడుపుతామని, పబ్లిక్ డిమాండ్‌ను బట్టి ప్రత్యేక లాంచీలు నడుపుతామని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. టికెట్లకోసం www.tstdc.in అనే వెబ్‌సైట్‌ను, వివరాలకు 9848540371, 9848125720, 7997951 023 ఫోన్ నంబర్లలో సంప్రదించవలసిందిగా అధికారులు సూచించారు.