– నల్లగొండ జిల్లా కలెక్టర్కు అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం వినతి
రామగిరి, డిసెంబర్ 29 : బ్రాహ్మణులకు ముఖ్యమైన అపర కర్మలకు స్థలం కేటాయించాలని అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ పట్టణంలో కిరాయి ఇండ్లలో ఉంటూ కాలం చేసే బ్రాహ్మణులకు అపర కర్మలు చేయుటకు, దహన సంస్కారాలు నిర్వహించే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, హైందవ సంస్కృతి, సాంప్రదాయాన్ని కాపాడే బ్రాహ్మణులకు ధూప దీప నైవేద్యం పథకంలో ప్రాధాన్యత పెంచాలని, వృత్తిని కొనసాగించడానికి జీవనోపాధి కల్పించడానికి దోహదపడే విధంగా ఎండోమెంట్ ద్వారా రిక్రూట్ అయిన ధూప దీప నైవేద్య పథకంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మైనార్టీల మాదిరిగానే ప్రభుత్వం సహకరించి అపర కర్మలకు స్థలం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావు, గౌరవ అధ్యక్షుడు దోమల పెళ్లి శశిధర్, గౌరవ సలహాదారుడు పులిజాల యాదగిరి రావు, భాస్కర్, రాయిని నవీన్ శర్మ, ఫణి ఆచార్య పాల్గొన్నారు.