తుంగతుర్తి, మార్చి 10 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సంతు సేవాలాల్ కమ్యూనిటీ భవన నిర్మాణ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. టెండర్ పూర్తి అయి 15 నెలలు అవుతున్నా అధికారులు స్థలం కేటాయించలేదని ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి స్థలం కేటాయించాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో గిరిజన మాజీ ప్రజా ప్రతినిధులు లాకావత్ మాన్సింగ్ నాయక్. ఆంగోతు నరేశ్, యాకూనాయక్, విరోజీ నాయక్, శ్రీశైలం, గోపగాని శ్రీను ఉన్నారు.