20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని నాలుగేండ్లలో చేశాం..
హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగేండ్లలో చేసిన అభివృద్ధి,
- ఉప ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాం
- నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకుడిని నేను
- మరోసారి ఆశీర్వదించాలి
- ఎన్నికల ప్రచారంలో
- బీఆర్ఎస్ హుజూర్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల, నవంబర్ 4 : హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, క్ష్యమని ఎమెజార్టీనే లమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగేండ్లలో చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకున్నానన్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా ప్రజల మధ్యే ఉన్నానని, చేసిన అభివృద్ధి చూసి మరోసారి గెలిపించాలని కోరారు. నేరేడుచర్ల చిన్న మున్సిపాలిటీ అయినా రూ.50కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపట్టామని, అవి చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
జాన్పహాడ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాల్వల లైనింగ్ పనులతో ఆయకట్టు చివరి భూములు సస్యశ్యామలం అయ్యాయన్నారు. పట్టణంలోని ఎన్ఎస్పీ, జాతీయ రహదారి విస్తరణలో నిరాశ్రయులైన వారికి ఇండ్లు మంజూరు చేయిస్తానన్నారు. అది చేస్తాం, ఇది చేస్తామని ప్రజల మధ్యకు వచ్చే సీజన్ వారి నాయకులను నమ్మి మోసపోవద్దని సూచించారు. భార్యకో పదవి, తనకో పదవి అన్న యావ తప్ప వారికి జనం సమస్యలు పట్టవని విమర్శించారు. కర్ణాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బుట్ట దాఖలయ్యాయన్నారు. స్వయంగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 5గంటల కరెంటూ ఇస్తున్నామని చెప్పడం వారి పని తీరుకు నిదర్శమని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి అసలు బస్సులే లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే తప్పేది లేదని, పదేండ్లలో తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం రెట్టింపు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అదేవిధంగా దాసారం,ముకుందాపురం, సోమారం, కల్లూరు, చిల్లేపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
ఆప్యాయంగా పలకరింపు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శనివారం నేరేడుచర్ల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోలాట బృందం మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. దుకాణాల్లోకి వెళ్లి తనను మరోసారి గెలిపించాలని కోరారు. పురవీధుల్లో భారీ ర్యాలీ తీయడంతో పట్టణమంతా గులాబీ శేణులతో సందడి వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు కొణతం సత్యనారాయణ రెడ్డి, అరిబండి సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, ఎంపీపీ లకుమళ్ల జ్యోతిబిక్షం, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీదర్, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, వైస్ ఎంపీపీ తాళ్ళూరి లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు అనంతు శ్రీనివాస్, శాఖమూరి శ్రీకాంత్, గ్రంధాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ్య, మత్స్యశాఖ చైర్మన్ పేబోయిన వీరయ్య, కౌన్సిలర్లు సాయి, సరిత, లలిత, నాగవేణి, బీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు కట్టా కళావతి, మండల ఎన్నికల ఇంచార్జీ మన్సూర్ అలీ, నాయకులు ఉన్నారు.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మద్దతు
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రూట్స్ మర్చంట్, హమా లీ వర్కర్స్ యూనియన్ నాయకులు శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నియోజకవర్గంలో కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఆదుకునే ఎమ్మెల్యే సైదిరెడ్డికి పూర్తిగా సహకరిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, కార్మిక సం ఘం నాయకులు నాగేందర్, వెంకటేశ్వర్లు, ఉస్మాన్, మల్ల య్య, బాలకృష్ణ, శ్రీను, వెంకన్న, నర్సింహ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

