– ఆగస్టు 20 వరకు దరఖాస్తులకు అవకాశం
– రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి
రామగిరి, జూలై 31 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో వివిధ విభాగాల్లో పీహెచ్‌డీకి అవకాశం కల్పిస్తూ శుక్రవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబందనల మేరకు కేటగిరి- 1, కేటగిరి-2లు అడ్మిషన్లు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. వీటికి దరఖాస్తులు చేసుకోవాడానికి ఆగస్టు 20 వరకు అవకాశం కల్పించారు. అయితే ప్యాకల్టీ ఆఫ్ కామర్లో 1, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సీఎస్ఐలో 13, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్లో 18, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో బయో టెక్నాలజీలో 5, కెమిస్ట్రీలో 31, గణితంలో 3, బయో కెమిస్ట్రీలో 8, ప్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ ఎకానామిక్స్‌లో 8, ఇంగ్లీష్ లో 2 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.mguniversity.ac.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.