రామగిరి, జూలై 31 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల (టీజీఎస్డబ్ల్యూఆర్డీసీడబ్ల్యూ) ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 28న జిల్లా స్థాయిలో నిర్వహించిన “నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్” పోటీల్లో కళాశాల విద్యార్థులు పలు బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. “డ్రగ్ ఫ్రీ ఇండియా” లక్ష్యంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రథమ బహుమతి : స్లోగన్ రైటింగ్, మైమ్, డ్యాన్స్, పెయింటింగ్, షార్ట్ ఫిల్మ్
ద్వితీయ బహుమతి : షార్ట్ ఫిల్మ్, సింగింగ్
తృతీయ బహుమతి : స్కిట్, సింగింగ్
జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.పవిత్ర వాణి కర్ష తెలిపారు. ఎన్ఎస్ఎస్ అధికారులు డా.సుల్తానా షేక్, డా.సి.హెచ్.రజిత విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఇదే జోరును కొనసాగించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.