నార్కట్పల్లి, జనవరి 25 : మండలంలోని షాపల్లి గ్రామంలోగల కమలాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో గురువారం ఆలయ అనువంశిక అర్చకులు కారంపూడి నర్సింహాచార్యులు, రాకేశచార్యుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని పూజలు నిర్వహించారు.
అంతకుముందు అర్చకులు ఎమ్మెల్యే వీరేశానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, బత్తుల ఊషయ్య, సట్టు సత్తయ్య, సిద్దగోని స్వామి, రాధారపు విజయలక్ష్మి, కొండయ్య, పాశం శ్రీనివాస్ రెడ్డి, సిలువేరు గిరి పాల్గొన్నారు. అలాగే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, సర్పంచులు బద్దం వరమ్మా రాంరెడ్డి, ఉపేందర్, నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు