చండూరు, మే 20 : కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోదీ ప్రభుత్వంపై కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేస్తుందని సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండ శ్రీశైలం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. వారి లాభాల కోసమే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తుందన్నారు. కేంద్రం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు ఆపకపోతే దేశవ్యాప్త సమ్మె మోదీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనుంజయ, సీనియర్ నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కత్తుల లింగస్వామి, ఉపాధ్యక్షులు నల్లగంటి లింగస్వామి, బిపంగి నాగరాజు, చిన్న రాజు, ముత్తమ్మ, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, కేవీపీఎస్ మండల నాయకులు నారాపాక శంకరయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు అంజి, శ్రీను, అంజయ్య, శేఖర్, వెంకన్న, కుమార్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు నాంపల్లి శంకర్, లక్ష్మయ్య, లక్ష్మమ్మ పాల్గొన్నారు.