కట్టంగూర్, జూలై 26 : మాజీ జడ్సీటీసీ, బీఆర్ఎస్ నాయకుడు తరాల బలరాములు తండ్రి పరమానందం అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ యాదవ్ శనివారం బలరాములుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం పరమానందం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో మంగ వెంటేశ్ యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, బెల్లి సుధాకర్, మంగదుడ్ల వెంకన్న, గోలి శివ ఉన్నారు.