శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి అదే స్థానంలో నూతన శిలాఫలకాలను కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేయడం కర్టెక్కాదని మండిపడ్డారు. మండల కేంద్రంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏ నాడూ పట్టించుకోలేదని, తాను ఆ క్యాంప్ కార్యాలయాన్ని దగ్గర ఉండి పూర్తి చేసిన తర్వాత నాలుగు నెలలు క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రభుత్వ కార్యాక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఉప ఎన్నికల ముందు కార్యాలయాన్ని పట్టించుకోని ప్రస్తుతం ఎమ్మెల్యే తన సొంత నిధులు కోటి రూపాయాలతో వెలివేషన్ చేయించున్నట్లు చెప్తున్నారని అన్నారు.
బిల్డింగ్ నిర్మాణానికి మొత్తం ఖర్చు కోటి రూపాయులు అవుతున్నదని, అలాంటిది వెలివేషన్‌కు కోటి రూపాయులు ఖర్చు పెట్టారా? గత ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని పునాదుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించి ఇచ్చినట్లు ప్రస్తుతం ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పడం భావ్యం కాదని తెలిపారు. పేరుకు మాత్రమే తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు. గత నెలలో ఉదయం సముద్రం ప్రాజెక్టు నుంచి మండల పరిధిలోని పులిపలుపుల చెరువులోకి తన సొంత నిధులతో కాల్వలు తవ్వించి నీళ్లు తీసుకొస్తున్నానని చెప్పారని, డ్రమ్ములకొద్ది పాలతో పాలాభిషేకాలు చేయించుకున్నారని, కానీ ఆ చెరువులోకి డ్రమ్ములు నిండే నీళ్లు రాలేదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందేలా పనిచేసిందని, రైతులకు వెన్నెముకగా నిలిచిందని చెప్పారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, తగిన సమయం చూసుకుని జనమే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ 16నెలల కాలంలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పాత వాటికే కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు.
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి మీద ఉన్న సోయి నియోజకవర్గం అభివృద్ధి మీద లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందుల సత్యం, నాయకులు పగిళ్ల సతీశ్, ఈద శరత్‌బాబు, పోలగోని సైదులు, మారగోని అంజయ్య, మేకల శ్రీనివాస్‌రెడ్డి, పూల వెంకన్న, దోటి కరుణాకర్, ఐతగోని విజయ్‌కుమార్,జంగలి సాంబయ్య, యడవల్లి సురేశ్, పందుల సురేశ్, శివార్ల వెంకన్న, బొమ్మగోని లింగస్వామి, జనగాం అంజయ్య, వరంగంటి శంకర్, బోయపర్తి సురేందర్, సైదులు, సురగి రవి, దెంద మల్లేశ్, గుర్రాల సురేశ్, గజ్జెల బాలరాజు, బోయలింగస్వామి, ఏరుకొండ శ్రీను, బొజ్జ శ్రీను, వనం లింగయ్య, కట్కూరి శంకర్, నకిరెకంటి సైదులు, మురళి, నర్సింహ, యాదయ్య, దోటి రమేశ్, హనుమంతు, రమాశంకర్, జక్కల శ్రీశైలం,సింగం సైదులు, పెంబళ్ల శంకర్, దొమ్మాటి శ్రీను, రెవెల్లి సైదులు, పెరమాళ్ల ప్రణ్య్కుమార్, బండారు శ్రీను, వట్టికొటి నర్సింహ, బొల్లం సైదులు, మారేశ్, బొల్లం వీరేశం తదితరులు పాల్గొన్నారు.