నల్లగొండ ప్రతినిధి, నవంబర్24(నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్‌లో మహాధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం జిల్లా మీదుగా ప్రయాణించనున్నారు. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటలకు బయలుదేరి 7:45 గంటల వరకు యాదాద్రి జిల్లా పరిధిలోని హైదరాబాద్ – విజయవాడ హైవే మీదుగా కొత్తగూడెం వద్ద ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తారు. అక్కడ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా నేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడ నుంచి ఉదయం 8:10 గంటలకు చౌటుప్పల్‌కు చేరుకుంటారు.
అక్కడ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌కు స్వాగతం పలుకనున్నారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాలకు 8:30 గంటలకు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు. తర్వాత 8:45 గంటలకు నార్కట్ పల్లి చేరుకొని నకిరేకల్ మీదుగా తుంగతుర్తి నియోజకవర్గంలోకి అడుగు పెడతారు.
ఉదయం 9:30 గంటలకు అర్వపల్లిలో కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తర్వాత జిల్లా దాటి ఉదయం 10:00 గంటలకు మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా ఉండనున్నారు.