సూర్యాపేట, మార్చి 20 : బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల సంబురాల సన్నాహక సమావేశానికి సూర్యాపేటకు గురువారం విచ్చేసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. దాదాపు పది వేల మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ తన వాహనం నుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్, శంకర్ విలాస్ పీఎస్ఆర్ సెంటర్, పూల సెంటర్, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్పీ కార్యాలయం సమీపంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
KTR : సూర్యాపేటలో 10 వేల బైక్‌లతో కేటీఆర్‌కు భారీ స్వాగతం.. ర్యాలీ వీడియో
మోటార్ సైకిల్ ర్యాలీలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రం గులాబీమయంగా మారిపోయింది. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్యాపేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గం నుండి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.