నిడమనూరు, జూలై 23 : విద్యుత్ శాఖ నిడమనూరు మండల ఏఈ గా సి.హెచ్ కృష్ణా రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన ఏఈ శరత్ ను ఎస్ఈ కార్యాలయానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. కాగా వేములపల్లి మండల ఏఈ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణారెడ్డికి నిడమనూరు ఏఈ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో పాటు లో వోల్టేజీ నివారణ లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు.