జైలు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
పోక్సో కేసులో నిందితుడిగా ఉంటూ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి రెండ్రోజుల కిందట పారిపోయిన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నందిమల్లకు చెందిన కిశోర్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్ననాటి నుంచి కబడ్డీలో ప్రావీణ్యం కనబరిచిన కిశోర్ జూన్‌లో గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు అమరచింత ఠాణాలో ఫిర్యాదు చేశారు.
అమరచింత, సెప్టెంబర్ 23 : పోక్సో కేసులో నిందితుడిగా ఉంటూ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి రెండ్రోజుల కిందట పారిపోయిన వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నందిమల్లకు చెందిన కిశోర్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్ననాటి నుంచి కబడ్డీలో ప్రావీణ్యం కనబరిచిన కిశోర్ జూన్‌లో గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకోగా ఆమె కుటుంబ సభ్యులు అమరచింత ఠాణాలో ఫిర్యాదు చేశారు.
బాలిక మైనర్ కావడంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి మహబూబ్‌నగర్ జిల్లా జైలులో ఉంచగా అప్పట్లో గోడ దూకి పారిపోయాడు. రెండ్రోజుల తర్వాత గ్రామానికి చేరుకున్న కిశోర్‌ను అమరచింత పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఆత్మహత్యకు యత్నించగా ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు.
సోమవారం అక్కడి నుంచి కూడా పారిపోవడంతో సవాల్‌గా తీసుకున్న పోలీసులు నందిమల్ల గ్రామంలో పెద్ద ఎత్తున మోహరించారు. విషయం తెలుసుకొని గ్రామానికి చేరుకునే క్రమంలో భయంతో సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు పోలీసుల సాయంతో ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

