దేవరకొండ రూరల్ : మొంత తుఫాన్ ప్రభావం వల్ల గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామంలోని గిరిజన గురుకుల పాఠశాల పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.కనీసం విద్యార్థులు పాఠశాల నుండి బయటికి రాలేనంతగా మోకాళ్ల లోతు పైన నీరు చేరడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న కలెక్టర్ ఇలా త్రిపాటి ఎస్పీ శరత్చంద్ర ప్రత్యక్షంగా ఘటన స్థలానికి చేరుకొని రెస్క్య చేసి తాడు సాయంతో విద్యార్థులను సురక్షితంగా, ప్రత్యేక వాహనాల్లో దగ్గర్లో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ కు తరలించారు దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు ఎస్పీ శర చంద్ర ఎ ఏస్పీ మౌనిక ఆర్డిఓ రమణారెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు