నల్లగొండ ప్రతినిధి, జనవరి30 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఈ నెల 28న మొదలైన నామినేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చివరి రోజు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. మూడు రోజుల పాటు 4,254 నామినేషన్లు రాగా.. నల్లగొండ జిల్లా లో 1,796, సూర్యాపేట జిల్లాలో 1,617, యాదాద్రి జిల్లాలో 841 నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలుగా తరలివచ్చారు. కార్యకర్తలు, అభిమానులతో నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద కిక్కిరిసిపోయాయి. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఆర్ఎస్తో పాటు అధికార కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు నామినేషన్లు వేశారు. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడు, భువనగిరి లాంటి పెద్ద మున్సిపాలిటీల్లో నిర్ణీత సమయం 5 గంటల వరకే నామినేషన్ కేంద్రంలోకి అడుగుపెట్టిన వారికి కూపన్లు ఇచ్చి క్యూలైన్లలో నిలబెట్టారు.
దీంతో రాత్రి 8 గంటల వరకూ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శనివారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నా రు. పరిశీలనలో తిరస్కరణకు గురైన వాటికి అభ్యంతరాలుంటే ఆదివారం ఫిర్యాదు స్వీకరిస్తారు. సోమవారం ఫిర్యాదులను పరిష్కరిస్తారు. వచ్చే నెల 3న ఉపసంహరణకు తుదిగడువు. అదే రోజు వార్డుల వారీగా అభ్యర్థుల తుది జాబితా ప్రచురిస్తారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా గుర్తించాలంటే భీఫాం సమర్పణకూ ఇదే చివరి రోజు. భీఫారం సమర్పిస్తేనే అభ్యర్థులకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులు ఇస్తారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణిస్తూ ఇతర గుర్తులు కేటాయిస్తారు. ఉపసంహరణ తర్వా త పూర్తి స్థాయిలో ప్రచారం ఊపందుకోనుం ది. నేతలంతా ప్రచారంలోకి దిగనున్నారు.
నల్లగొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు 582 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ 143, బీఆర్ఎస్ 134, బీజేపీ 123, ఇతరులు 182 మంది నామినేషన్ వేశారు. మిర్యాలగూడలో 48 వార్డులకు 507 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 213, బీఆర్ఎస్ 139, బీజేపీ 56, ఇతరులు 99, చిట్యాలలో 12 వార్డులకు 106 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 34, బీఆర్ఎస్ 33, బీజేపీ 15, ఇతరులు 24, నందికొండలో 12 వార్డులకు 95 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 37, బీజేపీ 12, ఇతరులు 16, దేవరకొండలో 20 వార్డులకు 254 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 105, బీఆర్ఎస్ 64, బీజేపీ 50, ఇతరులు 35, చండూరులో 12 వార్డులకు 117 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 45, బీఆర్ఎస్ 26, బీజేపీ 20, ఇతరులు 26, హాలియాలో 12 వార్డులకు 135 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 61, బీఆర్ఎస్ 40, బీజేపీ 11, ఇతరులు 23 మంది నామినేషన్ వేశారు.
సూర్యాపేటలో 48 వార్డులకు 741 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 249, బీఆర్ఎస్ 189, బీజేపీ 83, ఇతరులు 220, కోదాడలో 333 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 152, బీఆర్ఎస్ 73, బీజేపీ 28, ఇతరులు 80, తిర్మలగిరిలో 15 వార్డులకు 160 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ 73, బీఆర్ఎస్ 39, బీజేపీ 24, ఇతరులు 24, నేరడుచర్లలో 15 వార్డులకు 90 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 19, బీజేపీ 18, ఇతరులు 20, హుజూర్నగర్లో 28 వార్డులకు 293 రాగా.. కాంగ్రెస్ 121, బీఆర్ఎస్ 68, బీజేపీ 31, ఇతరులు 73 మంది నామినేషన్లు వేశారు.
భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులకు 305 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 91, బీఆర్ఎస్ 82, బీజేపీ 77, ఇతరులు 55, ఆలేరులో 12 వార్డులకు 77 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 26, బీజేపీ 19, ఇతరులు 9, యాదగిరిగుట్టలో 12 వార్డులకు 77 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 25, బీజేపీ 14, ఇతరులు 15, మోత్కూరులో 12 వార్డులకు 107 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 23, బీజేపీ 15, ఇతరులు 31, పోచంపల్లిలో 13 వార్డులకు 84 నామినేషన్లు రాగా.. కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 31, బీజేపీ 19, ఇతరులు 3, చౌటుప్పల్లో 20 వార్డులకు 191 నామినేషన్లు దాఖలు కాగా.. కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 50, బీజేపీ 41, సీపీఎం 10, ఇతరులు 25 నామినేషన్లు దాఖలయ్యాయి.