నీలగిరి, ఫిబ్రవరి 17: నాడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో భారీ సంఖ్యలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కంచర్ల భూపాల్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టిన రోజంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండుగ అన్నారు. రాదనుకున్న తెలంగాణను సాధించి, వ్యవసాయం, విద్యుత్, ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించడమే కాకుండా, యువతకు ఉద్యోగాల కల్పన, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు,కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, రైతుబంధు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచి దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చిదిద్దారన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, ఉద్యోగులు, మహిళలు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాల వారు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు.
అంతకుముం దు ఉదయం జిల్లా ప్రభుత్వ దవాఖాన వద్ద నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, బీఆర్ఎస్వీ నాయకులు రోగులు వారి బంధువులకు ఆల్పాహారం అందజేసి జిల్లా ప్రభుత్వ దవాఖానలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, సీనియర్ నేతలు చీరా పంకజ్ యాదవ్, చెరుకు సుధాకర్, నిరంజన్ వలి, మాలె శరణ్య రెడ్డి, రేగట్టె మల్లికార్జున రెడ్డి,మాజీ ఎంపీపీలు నాయకులు ఎస్కే కరీం పాషా, కంచనపల్లి రవీందర్ రావు, లొడంగి గోవర్ధన్, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, పార్టీ నల్లగొండ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని గణేశ్, దొడ్డి రమేశ్, పెరిక యాదయ్య, గోపగోని స్వాతి రాజశేఖర్, రత్నగిరి శ్రీనివాస్, పేర్ల ఆశోక్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సింగం లక్ష్మీరామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాసరెడ్డి గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బక్కా పిచ్చయ్య, బొజ్జ వెంకన్న, గుండబోయిన జంగయ్య, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, కందుల లక్ష్మయ్య, సింగం లక్ష్మి, కొండ్ర స్వరూప, మర్రి రేణుక, కంచర్ల విజ య, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయన నాగర్జున, కంకణాల వెంకటరెడ్డి, సిరిగిరి సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.