నల్లగొండ, సెప్టెంబర్ 17 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా నిజాం పాలన కారణంగా తెలంగాణకు వెంటనే స్వాతంత్య్రం రాలేదని, నాటి సాయుధ పోరాట ఫలితంగానే కేంద్రం ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టి ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసన సభ్యుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని శాసన మండలి సభ్యుడు మంకెన కోటిరెడ్డి, మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి బుధవారం ఆయన నల్లగొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే నాడు తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైందన్నారు. షేక్ బందగీ, దొడ్డి కొమరయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, కమలా దేవి, రావి నారాయణ రెడ్డి లాంటి గొప్ప నేతలు ప్రాణాలొడ్డి పోరాటం చేశారన్నారు.
అనంతరం జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ పదేండ్ల కాలంలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. అయితే రెండేండ్ల కిత్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తన వైఖరి మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్రంమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, మందడి సైదిరెడ్డి, జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, భోనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీను, రవీందర్రావు, కొండూరు సత్యనారాయణ, సహదేవరెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, కరీం పాషా, తుమ్మల లింగస్వామి, కందుల లక్ష్మయ్య, దేప వెంకట్ రెడ్డి, మారగోని గణేష్, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 17 : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు. నిజాం రాజు తన సంస్థానాన్ని దేశంలో విలీనం చేసిన రోజు సెప్టెంబర్ 17 అన్నారు. తమ పార్టీ ఉద్యమ సమయంలోనూ, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రతి యేటా జరుపుకుంటోందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జడ్పీటీసీ జీడి బిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, నాయకులు కక్కిరేణి నాగయ్య, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, రామ్మూర్తి, బొమ్మగాని శ్రీనివాస్, చింటు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 17: భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ సమైక్యతా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్ అవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు అతికం లక్ష్మీనారాయణ, పెంట నర్సింహ, ఇట్టబోయిన గోపాల్, నువ్వుల సత్యనారాయణ, అబ్బగాని వెంకట్‌గౌడ్, కడారి వినోద్, కుశంగల రాజు, తుమ్మల పాండు, పుట్ట వీరేష్, పెంట నితీన్, సూరజ్, తదితరులు పాల్గొన్నారు.