– బీఆర్ఎస్ పార్టీలో చేరిన కర్ణ నర్సిరెడ్డి
– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
హాలియా, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా హాలియా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, అనుముల మండలం హాలియాకు చెందిన కర్ణ నర్సిరెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు హాలియా పట్టణం 7వ వార్డుకు చెందిన చిట్టిపోలు నాగార్జున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, హాలియా పట్టణం ఎన్నికల సమన్వయకర్త తిప్పన విజయ సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు రిక్కల ఇంద్రసేనారెడ్డి, సాదం సంపత్ కుమార్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోరేపెల్లి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వర్ర వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ పొదిల్ల శ్రీనివాస్, సర్పంచ్ కూన్‌రెడ్డి భాస్కర్ రెడ్డి, చిట్టిపోలు శ్రీనివాసులు, కురాకుల రవి, రావులపాటి ఎల్లయ్య, మధుసూదనా చారి, రిక్కల అచ్చిరెడ్డి, జింకల లింగయ్య, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.