నల్లగొండ, డిసెంబర్ 3: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2028లో కేసీఆర్ సీఎం కావాలని, దానికి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే పునాది కావాలని నల్లగొండ మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజలను కోరారు. బుధవారం తిప్పర్తి మండలంలోని వెంకటాద్రి పాలెం నుంచి పెద్ద ఎత్తున కంచర్ల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదేండ్లల్లో కేసీఆర్ సీఎంగా ఉండి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చితే, ఈ రెండేండ్లల్లో రేవంత్ రెడ్డి సర్వనాశనం చేశారన్నారు.
మళ్లీ రాష్ట్రం గాడిన పడాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొంత లింగయ్య, బొంత నరేశ్, బొంత రమేశ్, కుంచం రాంబాబు, బొంత శేఖర్, కుంచం గిరి, బొంత శ్రీకాంత్, భాను, బాలు, సాయి, ఆలకుంట్ల శేఖర్ ఉన్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి కొ ల్లు నాగయ్య, దొంతినేని నాగేశ్వర్రావు, బొంత నాగరాజు, సుంకరి శం కర్, ఓర్సు చంద్రయ్య తదితరులు ఉన్నారు.