నల్లగొండ : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ధాన్యం ఎంత వస్తే అంత కొనుగోలు చేశారని, కానీ నేడు కాంగ్రెస్ నాయకులు మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఆర్జాల బావి, ఎస్ఎల్ బి సి, దండంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ధాన్యం తీసుకువచ్చి నెల అయినా ఇంకా తూకం వేయడం లేదని, కొర్రీలు పెడుతున్నారని తమను అన్ని విధాలుగా మోసం చేసి దోచుకుంటున్నారని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తూకంలో మోసం లంచాలు..తమకిష్టమైన వారికే ముందుగా తూకం వేయడం లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి ధాన్యం వెంటనే ఎటువంటి కొర్రీలు లేకుండా సేకరించాలని… లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో నల్లగొండ నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, నారబోయిన బిక్షం తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి, రాజశేఖర్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, గున్ రెడ్డి యుగంధర్ రెడ్డి, దండంపెల్లి సత్తయ్య, వజ్జ శీను బడుపుల శంకర్ తవిటి కృష్ణ తదితరులు ఉన్నారు.