కాంగ్రెస్‌ను కచ్చితంగా బొందపెడ్తం.. మాల సంఘాల నేత మాందాల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణ విధానాల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదని తెలంగాణమాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాసర్ ధ్వజమెత్తారు.
- రిజర్వేషన్లలో మాలలకు అన్యాయం
హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణ విధానాల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదని తెలంగాణమాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాసర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించి వచ్చే మూడు నెలల్లో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టి తీరుతామని హెచ్చరించారు.
మాలలకు ఉద్యోగ, రిజర్వేషన్ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు నిబంధనలను తుంగలో తొకి, మేధావులు, న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించకుండానే షమీమ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ విధానంపై ప్రభుత్వం ముందడుగు వేయడం సరికాదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

