మునుగోడు, మార్చి 24 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రడ్డి ఆదేశాల మేరకు సోమవారం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి 86 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 30న రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ నరేందర్, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Kalyana Lakshmi : మునుగోడులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ