కట్టంగూర్, సెప్టెంబర్ 25 : ఈ నెల 27న కట్టంగూర్‌లో జరిగే కల్లుగీత కార్మిక సంఘం 4వ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాచకొండ వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం కట్టంగూర్ మహాసభ కరపత్రాన్ని కార్మిక సంఘం నాయకులతో కలిసి విడుదల చేసి మాట్లాడారు. ప్రభుత్వం కల్లుగీత సొసైటీ టీఎస్‌టీఏ గ్రామాలకు మద్యం దుకాణాల్లో 25 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. మద్యం షాపులలో రిజర్వేషన్ పెంచితే ప్రభుత్వానికి లాభం తప్పా నష్టం ఉండదన్నారు. కార్మికుల పెండింగ్ ఎక్స్ గ్రేషియా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
50 ఏళ్లు నిండిన వృత్తిదారులకు పింఛన్ తో పాటు ద్విచక్ర వాహనాలు, ప్రతి గ్రామంలో తాటి, ఈత చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలన్నారు. జిల్లా కేంద్రంలో తాటి, ఈత ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల అంజయ్య, గుడుగుంట్ల బుచ్చిరాములు, దండెంపల్లి శ్రీను, మాద శ్రీను, పాడిచేటి వీరయ్య, గుండాల నగేష్, కొప్పుల రాములు, కారింగు సత్తయ్య పాల్గొన్నారు.