శాలిగౌరారం మార్చి 15 : కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామపంచాయతీ పరిధిలోని జోలంవారిగూడేనికి చెందిన సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జోలం సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ వల్లాల గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు జంగిలి మారయ్యతోపాటు కుటుంబాల కార్యకర్తలు శనివారం మాదారంకలాన్ గ్రామంలో కిశోర్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ మాట్లాడుతూ బీఆర్ఎస్లో చేరిన వారంతా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అయితగోని వెంకన్నగౌడ్, నాయకులు కట్టా వెంకట్‌రెడ్డి, మామిడి సర్వయ్య, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల మంజులాచంద్రమౌళిగౌడ్, గుజిలాల్ శేఖర్‌బాబు, భూపతి ఉపేందర్‌గౌడ్, బీఆర్ఎస్ వల్లాల గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్లపెల్లి రవీందర్, గట్టయ్య, చింతల శంకర్, అశోక్‌రెడ్డి, నోముల శ్రీనివాస్, వాక సత్యనారాయణ, సకినాల నర్సయ్య, యామగాని వెంకన్న, నూక జానయ్య, రాచకొండ గణేశ్, వంశీ, నోముల పరమేశ్, యాకన్నచారి, మైబు పాల్గొన్నారు.